Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3.11 లక్షల ఆర్థికసాయం అందజేత
- జగిత్యాలలో కోవిడ్‌తో మరణించిన రాజేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ కుటుంబానికి కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) చేయూతనందించింది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోదండాపూర్‌లో సీపీఎస్ ఉపాధ్యాయుడు, ఎస్జీటీగా పనిచేసిన ధోనిపల్లి రాజేశం ఇటీవల కోవిడ్ బారిన పడి మరణించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు సీపీఎస్ఈయూ ముందుకొచ్చింది. అతని పిల్లలు మహతి, మహాలక్ష్మికి శనివారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ నేతృత్వంలో కలిసి రూ.3.11 లక్షల పోస్టాఫీస్ డిపాజిట్ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ చనిపోయిన సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబాలకు అందించడానికి ఫ్యామిలీ పింఛన్ జీవోనెంబర్ 58ని ఇప్పటికే విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు మార్గదర్శకాలు విడుదల చేసి సీపీఎస్ బాధిత కుటుంబాలకు ఫ్యామిలీ పింఛన్ మంజూరు చేయాలని కోరారు. మార్గర్శకాలు లేకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్, కూరకుల శ్రీను, నాయకులు మల్లిఖార్జున్, మహేష్, సతీష్, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.