Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివేదికను అందజేస్తాం...: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిమాణిక్యం ఠాగూర్
- ఇక కార్యాచరణే :రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయటం ద్వారా 2023లో అధికారంలోకి తీసుకురావటమే తమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కేసీ వేణుగోపాల్ సమక్షంలో లోతైన సమీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు ఏఐసిసి స్థాయిలో పరిశీలకులను నియమించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో అన్ని విషయాలను సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదికను సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి శనివారం ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ... ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్, మోడీ.. అమిత్ షా మధ్య జరిగిన ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడేందుకు నిర్ణయించామని తెలిపారు. ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... హుజురాబాద్‌లో తలెత్తిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా సమన్వయం, ఐకమత్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... హుజూరాబాద్‌పై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. ఆ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని వివరాలూ అధిష్టానానికి తెలుసునని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామని వివరించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లా డుతూ... హుజురాబాద్ ఉప ఎన్నికను తాము కేవలం ఒక ఉప ఎన్నికగా చూడదలుచుకోవటం లేదన్నారు.
ప్రజల ఆలోచనా విధానం,పార్టీ కార్యకర్తల పనితనం, నాయకత్వం తీసుకుం టున్న నిర్ణయాలు ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతున్నాయనే విషయాలను పరిశీ లించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ తమ పరిపాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. ఆదివారం నుంచి తెలంగాణలో క్షేత్రస్థాయిలో కార్యా చరణకు దిగుతామని వెల్లడించారు.