Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4,039 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యా యనీ గత వానాకాలంలో ఎలాగైతే ధాన్యాన్ని సేకరించామో దాదాపు అదే సగటుతో ఈ వానాకాలంలోనూ అంతే ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. 2020 సీజన్ లో నవంబర్ 13 నాటికి దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే, ప్రస్తుతం ఒక లక్షా 13 వేల మందికి పైగా రైతుల నుంచి 1,510 కోట్ల విలువ గల ఏడు లక్షల 71 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. ధాన్యం రవాణాలోనూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటు న్నామనీ, ఎప్పటికప్పుడు కొన్న దాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామనీ, ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగినన్ని టార్పాలిన్లు సైతం ఏర్పాటు చేశామనీ, అవసరమైన చోట సమకూర్చుకోవాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతున్నదని మంత్రి గంగుల తెలిపారు.