Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రైతుల ధర్నా
- సూర్యాపేట జిల్లాలో
నవతెలంగాణ-చివ్వెంల
ధాన్యం కొనుగోలు కేంద్రం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. ధర్నాతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా కుడకుడలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే రెండురోజుల కింద ఐకేపీ స్థానంలో డీసీఎంఎస్ కేంద్రాన్ని ప్రారంభించారని తెలిపారు. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనివారం కేంద్రాన్ని అధికారులు ఎత్తివేశారని ఆరోపించారు. దాంతో వారం రోజులుగా ధాన్యంరాశుల వద్ద పడిగాపులు కాస్తున్న తాము చేసేది లేక ధర్నాకు దిగామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలుకేంద్రం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనాస్థలం వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.