Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగంటుతున్న మానవీయ ప్రమాణాలు : ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోజు రోజుకీ రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయని ప్రొఫెసర్ హర గోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల'పై శిరీష, బంధు మిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. శిరీష అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ పోరాటంపై ప్రజలకు అవగాహన లేకపోయినా పర్వాలేదుగానీ, ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి ఆలోచిం చాలని చెప్పారు. రాజకీయాలంటే ఇచ్చిపుచ్చుకోవటం కాదనీ, మనిషి చనిపోయాక మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమేనన్నారు. వాటిని సమాజంతో పంచుకోవాలని ఆర్కే భార్య శిరీష అనుకున్నారన్నారు. ఆర్కే సంస్మరణ సభ జరపాలనుకుంటే పోలీసులు అడ్డుకున్నారనీ, ఆర్కే మరణానికి ముందు, ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన వివిధ వార్తలను సంకలనం చేయటం తప్పుకాద న్నారు. భర్త జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలన్న ఉద్దేశంతో ముద్రిస్తున్న పుస్తకా నికి అనుమతివ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ఆర్కే వచ్చారనీ, మేము కూడా కలిసామని గుర్తుచేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో చర్చలకు ప్రయత్నించగా కుదరలేదన్నారు. అనంతరం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్చల ద్వారా ఆర్కే అందరికి సూపరిచితులు అయ్యారని చెప్పారు. ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయిన ఆర్కే జ్ఞాపకాలు కూడా తెలియజెప్పే అవకాశం లేదనీ, ఇది రాజ్యాంగ విరుద్దమని వివరించారు. సీఎం కేసీఆర్ తెలంగాణా ఉద్యమ దశలో 'మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అన్నారు' కానీ అధికారంలోకి వచ్చాక అన్ని మారిపోయాయని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఫాసిస్ట్ ధోరణి మార్చుకొని ఆర్కే భార్య శిరీష పుస్తకం ప్రచు రించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. పుస్తకంలో ఏముందో చూడ కుండా, ముద్రాణాల యంపై దాడి చేసి అడ్డుకోవటం అన్యాయమన్నారు. రాష్ట్రంలో అప్రకటిత నిషేదం కొనసాగుతున్నదని వివరించారు. సీపీఐ(ఎంఎల్) ఎన్డీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, విరసం నాయకులు పాణి, ఆరుణోదయ నాయకురాలు విమలక్క, సామాజిక కార్యకర్త సజయ, బంధుమిత్రుల సంఘం నాయకురాలు పద్మ, పౌరహక్కుల నేత లక్షణ్, లక్ష్మణ్, సురేష్, రవి, ఎం శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
ప్రింటింగ్ ప్రెస్పై పోలీసుల దాడి చట్ట విరుధ్ధం : మానవ హక్కుల వేదిక
హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకోవడం ఏ రకంగా చూసినా చట్ట విరుద్ధమైన చర్యనీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మానవహక్కుల వేదిక నాయకులు ఎస్ జీవన్‌కుమార్, గొర్రెపాటి మాధవరావు, డాక్టర్ ఎస్. డాక్టర్. తిరుపతయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.