Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి
- తెలంగాణ గిరిజన సమాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో దళిత గిరిజనులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయా సంఘాలు సంయుక్తంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. చేయని నేరాలకు చిత్రహింసలు పెట్టి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులులే లాకప్ డెత్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వం స్పందించకపోవటం అన్యాయమని పేర్కొన్నారు. దాడులకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి నేతలు జె. కుమార్, డి.రాములు, చెన్నయ్య, భానుచందర్, గిరిజన సమాఖ్య నేతలు రూప్ సింగ్, రాజు నాయక్, నగేష్, శ్రీను నాయక్, జె. వెంకటేష్, చంద్రు నాయక్ పాల్గొన్నారు.