Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతిచెందాడు. ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్కేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం అందింది. డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తారసపడిన మావోయిస్టులు జవాన్ల పైకి విచక్షణార హితంగా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణార్థం జవాన్లు సైతం ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఘటన ప్రాంతంలో మావోయిస్టు మృతదేహం, ఏకే 47 ఆయుధం, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టు 6వ నంబర్ కంపెనీ కమాండర్ సాకేత్ నురుటిగా గుర్తించినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.