Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెన్నవరం భూపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి తెలిపారు. మండలి ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ ,విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే, మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడలు విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడతాయనీ, ముఖ్యంగా ఆడపిల్లలు కరాటే విద్యను తప్పకుండా అభ్యసించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు భానుప్రసాద రావు, ఎం.ఎస్. ప్రభాకర్ రావు పాల్గొన్నారు.