Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై దాడి చేసిన బండి సంజరుని అరెస్టు చేయాలి : ఎమ్మెల్సీ పల్లా డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుతోపాటు పేరుమోసిన గూండాలతో కలిసి రైతులపై చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రైతుబంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. వడ్లు కొంటామని చెప్తేనే తిరగనిస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొంటారో, లేదో చెప్పకుండా ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. యాసంగిలో వరిపంట వేయొద్దంటూ కేంద్రం చెబితే బండి సంజరు బాధ్యతారహితంగా బూటకపు మాటలు చెప్తున్నారని అన్నారు. బీజేపీకి విధానం ఉంటే ఉత్తరభారత్‌లో కొన్నట్టు దక్షిణ భారత్‌లో పంటలను ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకేనీతి ఉండాలని సూచించారు. వడ్ల కొనుగోలపై బీజేపీ విధానం చెప్పాలనీ, బండి సంజరు అబద్ధపు ప్రచారానిన తిప్పికొడతామని అన్నారు. పంజాబ్‌లో కొన్నట్టు తెలంగాణ ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన పోరాడతామని చెప్పారు.