Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడికి గురైనబాలికకు ఐద్వా పరామర్శ
నవతెలంగాణ-కంఠేశ్వర్
బాలికపై లైంగికదాడి చేసిన దుండగున్ని కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేసింది. బాధిత బాలికను సోమవారం ఐద్వా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో లైంగికదాడులు పెరగడం బాధాకరమన్నారు. బోధన్ మండలంలో మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన శ్రీకాంత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని, మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షురాలు బెజ్జం సుజాత, జిల్లా నాయకులు రోజా, రమణి తదితరులు ఉన్నారు.