Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
షార్జాతో పాటు తెలంగాణలో ఆయా రంగాల అభివద్ధి కోసం హమ్రియత్ ఫ్రీ జోన్ అథారిటీ (హెచ్ఎఫ్ జెడ్ఏ)తో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ టీసీసీఐ) కలిసి పని చేయనున్నది. ఈ మేరకు ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ప్రతినిధులు యుఏఇలో ఎక్స్పో 2020 సందర్భంగా హెచ్ఎఫ్ జెడ్ ఏ డైరెక్టర్ సౌద్ సలీం అల్ మజ్రౌరీని సోమవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు వ్యాపార అవకాశాలపై చర్చించారు. షార్జా ప్రభుత్వం వ్యాపార ప్రోత్సహానికి తీసుకుంటున్న చర్యలను డైరెక్టర్ వివరించారు.