Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కళాశాల బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల ప్రాంగణంలో సోమవారం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సాయికిరణ్(17) కాకతీయ కళాశాలలో ఇంటర్ విద్యనభ్యసిస్తున్నాడు. సోమవారం మెయిన్ క్యాంపస్ భవనం పైనుంచి దూకాడు. గమనించిన కళాశాల యాజమాన్యం విద్యార్థిని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. సాయి కిరణ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, సోమవారం బైక్పై వస్తు న్న క్రమంలో ఓ వ్యక్తికి యాక్సిడెంట్ చేసినట్టు సమాచారం. సదరు బాధితులు డబ్బులు డిమాండ్ చేయడంతో భయాందోళనకు గురై ఆత్మ హత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.