Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ 22కు వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జహీరాబాద్ ఎంపీ పీపీ పాటిల్‌పై క్రిమినల్ కేసుల గురించి గత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీగా పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్మోహన్రావు దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ చేపట్టారు. జార్ఖండ్‌లో ఒక క్రిమినల్ కేసులో పాటిల్‌కు అక్కడి కోర్టు జరిమానా విధించిందని సీనియర్ లాయర్ వివేక్‌రెడ్డి వాదించారు. మరో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందన్నారు. పాటిల్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీన్రాహెల్ వాదిస్తూ, ఎలక్షన్ పిటిషన్ వేయాల్సిన కేసు కాదన్నారు. ఎన్నికలకు సంబంధం లేని కేసులో జరిమానా చెల్లిస్తే ఎన్నికల ముందు జనానికి చెప్పలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. పాటిల్ వ్యాపారంలో భాగంగా దాఖలైన కేసుల సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది.
ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై...
వార్షిక, ఇన్స్టెంట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఫెయిలైన స్టూడెంట్స్‌కు రెండో సెమిస్టర్ పరీక్షలు పెట్టాలని కోరుతూ దాఖలైన కేసుల్లో హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. రెండో సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించేలా కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీకి ఆర్డర్ ఇవ్వాలన్న రిట్లపై సోమవారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. నేషనలవాదనల తర్వాత తీర్పు వాయిదా వేసింది.