Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల నిర్మూలన వేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఆయా పాఠశాలలు, కళాశాలల్లో చేరటానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ సీట్లు కేటాయించాలని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల గోవిందు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగుల నాగేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా ప్రజల జీవన పరిస్థితులు దిగజారాయని తెలిపారు. కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని భరించలేక ప్రభుత్వ విద్య తమ విద్యగా భావించిన పేదలు గురుకులాల్లో విద్య నేర్చుకోవడానికి క్యూ కడుతున్నారని చెప్పారు. అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి మెరుగైన విద్య అందేలా చూడాలని సూచించారు.