Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పద్ధతిలోనే ధాన్యం డబ్బులు జమ చేయాలి
- కౌలు రైతుల డిమాండ్.. కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీపీతో సమస్యలు తలెత్తుతున్నాయని, పాత పద్ధతిలోనే ధాన్యం డబ్బులను ఖాతాలో జమ చేయాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఎడపల్లి మండల రైతులు నిజా మాబాద్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా పలువురు కౌలు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను సాగుదారుని ఖాతాలో వేయ కుండా, భూ యజమాని ఖాతాలోనే జమ చేస్తున్నారని తెలిపారు. ఓటీపీ పద్ధతితో సామాన్య రైతులకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పొలం సాగు చేసిన కౌలు రైతుకు కాకుండా భూమి యజమానికి ఓటీపీ రావడం వల్ల కౌలుదారు నష్టపోతున్నారని తెలిపారు. భూమి యజమానికి ఏమైనా పంట రుణాలు, ఇతర ఏవైనా రుణాలు ఉంటే ధాన్యం డబ్బులు చెల్లింపు చేయకుండా ఆపేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భూమి సాగు చేసిన సాగుదారుకే నేరుగా డబ్బుల చెల్లింపు చేసేవారన్నారు. అందువల్ల పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను నేరుగా సాగుదారు, కౌలుదారుకు చెల్లించేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, ఓటీపీ పద్ధతి రద్దు చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కౌలు రైతు లు నీరడి రవి కుమార్, బుడ్డ పోశెట్టి, మేఘావత్ సరిదాస్, నగునూరి రాజశేఖర్, దేవసోత్ వసంత్, గైని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.