Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్కు జూలకంటి సూచన
- తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్... దొంగ ధర్నాలు, కొంగ జపాలు చేస్తున్నాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఇలాంటి నాటకాలను కట్టిపెట్టాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆ రెండు పార్టీలకు సూచించారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న రెండు పార్టీలు... ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కుప్పల మీదే రైతుల గుండెలు ఆడిపోతుంటే సోయి లేదా..? అని ప్రశ్నించారు. అన్నదాతల సమస్యలు పట్టని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు, నల్లగొండ జిల్లాలో పరస్పరం దాడులకు పాల్పడటం ద్వారా వీధి రౌడీల్లా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటికైనా ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని జూలకంటి డిమాండ్ చేశారు.