Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా
- త్వరలోనే టీఆర్ఎస్ గూటికి
- మరి కొందరికి కేసీఆర్ నుంచి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికార టీఆర్ఎస్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులు, వాటి ఎన్నికకు సంబంధించిన కోలాహలం మొదలైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారు. మరోవైపు గతంలో 'సీఎం నుంచి ఆశీర్వాదం' పొందిన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి... తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు చేరుకున్న ఆయన సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ వెంటనే సీఎస్ దాన్ని ఆమోదించటం గమనార్హం. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవుల కోసం గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్సీ కోటిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలిత పేర్లను సీఎం ఖరారు చేసినట్టు సమాచారం. కేసీఆర్ పిలుపు మేరకు వీరందరూ సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.