Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీలో నిర్ణయం
- ధాన్యం కొనుగోళ్లపై ప్రధాన చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా లేదా దీక్ష చేయబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ ఉద్యమం కోసం దీక్ష చేపట్టిన నవంబరు 29న ఆయన హస్తినలో ఆందోళన చేపట్టబోతు న్నట్టు సమాచారం. అదేరోజు పార్లమెంటు శీతా కాలసమావేశాలు కూడాప్రారంభం కానుం డటంగమనార్హం. ఇలాంటి అంశాలన్నింటి పై చర్చించేందుకు వీలుగా టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జర గనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయం త్రం నాలుగు గంటలకు జరిగే ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రధానంగా చర్చించ నున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంఈ విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ, రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నదని టీఆర్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించి... భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారని తెలిపింది.