Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓటమి పాలుకాగా, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్) విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహార పంటల సాగు, కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. ఆ రెండు పార్టీలు రైతులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయని ఆక్షేపించింది. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేలా బీజేపీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ గతంలో నాటకీయ ఆందోళనలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా రైతులపై ప్రేముంటే ఆ రెండు పార్టీలు సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి రైతులను ఆదుకోవాలని టీజేఎస్ డిమాండ్ చేసింది.