Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలోనే 33 వేల మంది డైరెక్టర్లను తిరిగి నియమించనున్నట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) వి.ఇ.జోస్ కుట్టీ తెలిపారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్స్, ప్రొఫెషనల్స్ టూ బి డైరెక్టర్స్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. నిబంధనల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఆర్ఓసీ పాత్ర కీలకంగా మారుతున్నదని తెలిపారు. కంపెనీ యాక్ట్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. కంపెనీ డైరెక్టర్ అయినా, ఉద్యోగి అయినా జ్ఞానవంతంగా వ్యవహరించాలని కోరారు. ఛాంబర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ ఒక కంపెనీ నైతికంగా, చట్టబద్ధంగా నడవడానికి, ఆర్థిక నిర్వహణ విధానాలపరంగానూ డైరెక్టర్ పాత్ర కీలకమని తెలిపారు. ఛాంబర్స్ ఐబీసీ కమిటీ కార్పొరేట్ లాస్ సహ అధ్యక్షులు తస్నీమ్ షరీఫ్ మాట్లాడుతూ డైరెక్టర్లకు అవగాహన కల్పించేందుకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామనీ, వారికి శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో అడ్వకేట్ ఎక్తా బల్, ఛాంబర్స్ కార్యదర్శి వీణ తదితరులు పాల్గొన్నారు.