Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ చెల్లింపుల్లో ఆలస్యం తగదని ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర (ఎస్టీయూటీఎస్) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీ ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా లబ్దిదారులైన పింఛనర్లు, కేజీబీవీ సిబ్బంది, కాంట్రాక్టు అధ్యాపకులు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనంతో కూడిన చెల్లింపులు జరగలేదని తెలిపారు. 2018, జులై ఒకటిన ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి నూతన వేతన స్థిరీకరణతోపాటు పింఛన్ సవరణ, కమ్యూటేషన్ చెల్లింపుల దిశగా ప్రభుత్వ చర్యలు ఆలస్యం కావడంతో వారి బాధలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. పీఆర్సీ తక్షణ వర్తింపు, చెల్లింపుల కోసం ఇకనైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీ, ఇతర కాంట్రాక్టు సిబ్బందికి 30 శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీని ఇస్తామని సీఎం స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. చెల్లింపుల విషయంలోనూ చర్యలు అలాగే ఉండాలని సూచించారు.