Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజయ్ పై నిరంజన్‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పనీపాటా లేని బీజేపీ నేతలు లేనివి ఉన్నట్టు చిత్రీకరించి సమస్య సృష్టిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొంటుందో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లా డారు. కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ ఆందోళన చేయడం హాస్యాస్ప దమన్నారు. పండించిన పంటలోగానీ, రైతులకు ఇచ్చే కరెంట్లోగానీ బీజేపీ పాత్ర లేదని చెప్పారు. రైతుల మోటార్లకు మీటర్లును బిగించాలనే ప్రయ త్నాన్ని విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. ఏ అర్హతతో రైతుల వద్ద ఆందోళన చేయటా నికి వెళ్ళారని ప్రశ్నించారు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘంగా రోడ్ల మీద ధర్నా చేస్తుం డటం బీజేపీ పాలనకు నిదర్శనమని తెలిపారు. ముర్ఖపు, అసత్యపు ప్రచారాలతో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నదనీ, రైతుల వద్దకు వెళ్ళి మీ ఇష్టాను సారంగా చేస్తామంటే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరిం చారు.