Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడక్కడా భారీ వర్షం పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. గురువారం ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వాన, అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 179 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మండలం భీమవరంలో అత్యధికంగా 3.15 సెంటీమీటర్ల వాన పడింది. జోగులాంబ, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆగేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాలలో నెలకొన్న అల్పపీడనం ఆగేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నది. ఈ అల్పపీడనం ఇంచుమించు పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఆంద్రప్రదేశ్- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న తూర్పు-మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈ నెల 18న చేరే అవకాశం ఉంది.