Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆ వర్సిటీ జానపద కళల శాఖలో ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో 'తెలంగాణ రాష్ట్ర సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూందాం) పాత్ర'అనే అంశంపై ఆయన పరిశోధన చేసినందుకు ఈ అవార్డును తీసుకున్నారు. ఈ మేరకు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి సీహెచ్ మురళీకృష్ణ మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 2014-15 విద్యాసంవత్సరంలో పీహెచ్డీ కోర్సులో చేరిన రసమయి బాలకిషన్‌కు ఇటీవల వైవాను నిర్వహించామని వివరించారు. మంగళవారం విశ్వవిద్యాలయం ఉపకులపతి తంగెడ కిషన్‌రావు పీహెచ్డీ పూర్తయిన ధ్రువీకరణ పత్రాన్ని బాలకిషన్‌కు అందజేశారు. కళాకారుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకిషన్ తెలుగు వర్సిటీ పూర్వవిద్యార్థి కావడం హర్షణీయమని వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ తెలిపారు.