Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమే కారణం!
నవతెలంగాణ-అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సులో విషాదం జరిగింది. ఆటో డ్రైవర్, బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేట మండల పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన జగ్గారావు(28) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అనూష(14) చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. జగ్గారావు విద్యార్థులను పాఠశాలకు తరలించేవాడు. ఈ క్రమంలో తరుచూ పాఠశాలకు వచ్చి అనూషను కలిసేవాడు. సోమవారం అనూష పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి సోమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జగ్గారావు, అనూష అశ్వారావుపేట బస్టాండ్‌లో కొత్తగూడెం డిపోకి చెందిన ఆర్టీసీ బస్ ఎక్కారు. అప్పటికే పురుగుల మందు తాగడంతో బస్సులో వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. డ్రైవర్ గమనించి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరిని అంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. వైద్యం అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఇద్దరూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఇరువురి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు.