Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీజేపీ, టీఆర్ఎస్లు దొంగనాటకాలు మాని రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ధాన్యం కొనే బాధ్యత ఇరు ప్రభుత్వాలపై ఉందని, ఆ పార్టీ నాయకులే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకో చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి ధాన్యం కొనుగోలు చేసేలా, యాసంగిలో వరి సాగుకు సమ్మతించేలా.. మూడు నల్ల చట్టాలను రద్దు చేసేలా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు పర్యటన ఉద్రిక్తతకు దారి తీసిందని, దీనికి ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, టూటౌన్ కార్యదర్శి భావండ్ల పాండు, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్థన తదితరులు పాల్గొన్నారు.