Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఒక్కరే బీసీ అభ్యర్థిని ప్రకటించడం పై నిరసన వ్యక్త చేశారు. ఈ నేపథ్యంలోనే అంబర్‌పేటలోని పూలే విగ్రహం వద్ద నిరసనకుకు దిగారు. ''టీఆర్ఎస్కు రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉంటే అందులో దాదాపు 40 లక్షల మంది బీసీలే ఉన్నాకూడా చట్టసభల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. సీఎం కేసీఆర్ గతంలో ఇప్పటివరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి అణగారిన కులాల అయిన మంగలి, కుమ్మరి, అలాగే శాసనసభలో ప్రాతినిధ్యం లేని పద్మశాలి కులస్తులకు ఈసారి ప్రాధాన్యత ఇస్తానన్న మాట తప్పి తిరిగి అగ్రవర్ణ కులాలకు నాలుగు సీట్లు కేటాయించారు. ఏదో కంటితుడుపుగా ఒక్క బీసీ, ఎస్సీ అభ్యర్థి కేటాయించి కేసీఆర్ మాట తప్పారని' జాజుల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.