Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సివిల్ సప్లరు ఆఫీసు ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
''ధరలిట్ట రోజు రోజుకూ పెంచుతుంటే పేదలు ఏం తినాలె. ఎట్ట బత్కాలె? ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నియంత్రంచట్లేదు?'' అని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ప్రశ్నించారు. ధరలను తగ్గించాలని, కేరళ తరహాలో రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకల్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లరు భవన్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, పనిలేక, మరోపక్క తగ్గుతున్న వేతనాలతో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూరగాయలు, పాలు, పప్పు, నూనె, చింతపండు, చక్కెర వంటి నిత్యం వాడుకునే అన్ని రకాల సరుకుల మీద ధరలు పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పేదలు, మధ్యతరగతి ప్రజానీకానికి మోయలేని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల హైమావతి, ఎం.వినోద, కె.నాగలక్ష్మి, శశికళ, ఎం.లక్ష్మమ్మ, ఎం.స్వర్ణలత, షబానా, లక్ష్మి, వరలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.