Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర రవాణా కార్మికులకు మద్దతు : సీఐటీయూ జనరల్ కౌన్సిల్ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేయాలనీ, మహారాష్ట్రలో రవాణా కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ సీఐటీయూ జనరల్ కౌన్సిల్ తీర్మానాలు చేసింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యం పెంచుతుండటం పేదలకు భారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు కూడా ధరలు కూడా పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం వేస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రజారవాణా పరిరక్షణ కోసం మహారాష్ట్రలో ఈ నెల మూడో తేదీ నుంచి ట్రాన్స్పోర్ట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటించారు.