Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోరోజు ధర్నాలో జేఏసీ నాయకులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ ఉద్యోగులకు తక్షణం వేతన సవరణ చేయాలని పలు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా కంపెనీలలో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగులు జాయింట్ ఫోరం ఆధ్వర్యంలో మూడోరోజైన బుధవారం బేగంపేటలోని ఓరియంటల్ ఇనూరెన్స్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎన్‌ఎఫ్‌జీఐఈ ప్రధాన కార్యదర్శి పీఎస్ బాజ్పారు, ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్ఎస్ రాజు, ఓరియంటల్ ఆఫీసర్స్ ఆలిండియా నాయకులు వై సుధాకర్‌రావు, జీఐఈఏఐఏ హైదరాబాద్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎమ్ శివశంకర్, బీవీకేఎస్ ప్రధాన కార్యదర్శి ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, హెచ్ఆర్జీఐఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ నారాయణరావు, వై సుబ్బారావు తదితరులు మాట్లాడారు. 2017 ఆగస్టు 1 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే సెటిల్ చేయాలని, పెన్షన్ నవీకరణ, ఫ్యామిలీ పెన్షన్ 30 శాతం ఇవ్వాలనీ, ఎన్పీఎస్ రద్దు చేసి ఉద్యోగులందరినీ 1995 పెన్షన్ పథకంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిపారు. నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.