Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్ల విషయంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుధ్దం ముదురుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో గురువారం మహాధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.