Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అనధికారికంగా విక్రయాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను అరికట్టడానికి నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో అక్టోబర్లో 543 తనిఖీలను నిర్వహించి 492 మంది అనధికార అమ్మకందార్ల నుంచి రూ.4,78,640 జరిమానా వసూలు చేశారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు జరిమానా చెల్లించని వారిపై తదుపరి చర్యలు తీసుకునే అధికారమున్న రైల్వే పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో కమర్షియల్ విభాగం అధికారులు, టికెట్ తనిఖీ సిబ్బంది, రైల్వే రక్షక దళ సిబ్బంది పాల్గొన్నారు. వారిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానాన్ మాల్య అభినందించారు.