Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి నిధులు, అధికారాలను పెంచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల సముదాయంలోని కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సంఘం సభ్యులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లా పరిషత్ చైర్మెన్ గౌరవ వేతనం నెలకు రూ. 7,500 ఉండగా, ప్రస్తుతం లక్ష రూపాయలు ఉందని గుర్తుచేశారు. జడ్పీటీసీల గౌరవ వేతనం రూ.2,250 నుంచి రూ.13వేలకు, ఎంపీటీసీల వేతనం రూ.750 నుంచి రూ. 6,500, గ్రామ సర్పంచ్ల గౌరవ వేతనం వెయ్యి నుంచి రూ. రూ. 6,500లకు పెరిగిందని తెలిపారు.