Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మెన్ టి.శ్రీరంగారావు ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు గురువారం సందర్శించారు. వారికి రాంకీ సీఇఓ గౌతమ్ రెడ్డి ప్లాంటు పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ప్లాంటులో విద్యుత్ ఆదా, ఉత్పత్తి, పరిశోధనకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యాన్ని తగ్గించటంలో ఇలాంటి ప్లాంట్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే అంశంపై వారు చర్చించారు. ఈ ప్లాంట్ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే.