Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఎన్‌బి అధికారి ఎన్విఎస్ ప్రసాద్ వెల్లడి
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బార్ అభియన్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ క్రెడిట్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ సర్కిల్లో బుధవారం రుణాల జారీపై ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. దీనికి బ్యాంక్ అధికారులతో పాటుగా రుణ గ్రహీతలు హాజరయ్యారని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాంప్ ప్రారంభోత్సవంలో హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఎన్వీఎస్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంక్ ఎప్పుడూ ఎంఎస్ఎంఈ రంగానికి ఆర్థిక మద్దతును అందిస్తుందన్నారు. గడిచిన అక్టోబర్‌లోనూ ఇలాంటి క్యాంప్‌లు ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలకు రుణ మద్దతును అందించామన్నారు. రుణాలపై ప్రారంభ వడ్డీ రేటు 6.5 శాతంగా ఉందన్నారు. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతాన్ని తగ్గిస్తున్నామన్నారు. తాజా క్యాంప్‌లో 80 మంది ఎంఎస్ఎంఇ రుణ గ్రహీతలకు రూ.220 కోట్ల విలువ చేసే రుణాలు అందించామని ఆ బ్యాంక్ తెలిపింది.