Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల ఎదుట ధర్నా, కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ- నల్లగొండ
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఎదుట 2019 బ్యాచ్ విద్యార్థులు ధర్నా చేశారు. అనంతరం పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కళాశాల భవనం ఏర్పాటు చేసి, భోజన వసతి గృహం కల్పించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కళాశాల నుంచి వసతి గృహానికి దూరం తగ్గించాలన్నారు. ఆటలు ఆడుకోవడానికి, వ్యాయామం చేయడానికి మైదానం, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. వసతి గృహాల్లో తాగునీటి సౌకర్యం కల్పించి, చదువుకోవడానికి టేబుల్, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌ను అడిగితే ''ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్లండి'' అని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.