Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల భారీ వర్షం, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న వెదర్ బులిటెన్లో పేర్కొన్నారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. చెన్నై-పుదుచ్చేరి మధ్యలో కేంద్రీకృతమైన అది శుక్రవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్- ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి.