Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావును శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు 30 శాతం వేతన పెంపు ఆర్థిక శాఖ అనుమతి పొందినందున వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖా ధికారులను మంత్రి ఆదేశించారని తెలిపారు. 2020, ఏప్రిల్ ఒకటి తర్వాత రిటైరైన ఉద్యోగుల రివైజ్డ్ పింఛన్, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, మెడికల్, సరెండర్ లీవు బిల్లులతోపాటు మధ్యాహ్న భోజన బకాయిలను చెల్లించాలని కోరారు. దీనిపై సంబంధిత ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రెండు రోజుల్లో పూర్తి చెల్లింపులు జరిగేలా చర్యలు చేపడతామంటూ మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.