Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఇల్లందు
చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల విలీనం నిలిపివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కృష్ణవేణికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు తాళ్లూరి కృష్ణ, ప్రాజెక్ట్ కార్యదర్శి షేక్ ఫాతిమా మాట్లాడారు. ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను సూపర్ వైజర్‌గా, మినీ టీచర్లను మెయిన్ టీచర్‌గా ప్రమోట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలేటి సంధ్య, యాకమ్మ, దేవేంద్ర, దేవమణి, శారద, మాధవి, విజయ, నవమణి, సరిత, రేణుక, లక్ష్మీకాంత, లావణ్య, నాగమణి, పాల్గొన్నారు.