Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఠి ప్రసూతి ఆస్పత్రిపై నివేదిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ నగరం కోఠి ప్రసూతి ఆస్పత్రిలో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాలు, పడకల గురించి వాస్తవ నివేదిక తెప్పించుకునేందుకు హైకోర్టు న్యాయవాది కిరణ్మయిని కోర్టు సహాయకారిగా నియమించింది. పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్‌గా తీసుకుని 2016 నుంచి హైకోర్టు విచారణ చేస్తోంది. వసతులు కల్పించామనీ, పిల్‌ను క్లోజ్ చేయాలని ప్రభుత్వం కోరింది. వాస్తవాల నివేదిక వచ్చాకే ఉత్తర్వులు ఇస్తామని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ప్రకటించింది. నేలపై గర్భిణీలకు వైద్యం చేసే దుస్థితి ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉందని, వసతుల కల్పన కూడా తేలుస్తామని చెప్పింది. విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది.
సంధ్య కన్వెన్షన్ ఎమ్‌డీకి బెయిల్
రాయదుర్గం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టయిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావ్కు హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ.20 వేల విలువైన మరో రెండు పూచీకత్తులను సమర్పించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. శ్రీధర్‌రావుపై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ, ఎంతోమంది బాధితులు ఉన్నారనీ, 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, బెయిల్ హైకోర్టు నుంచి నేరుగా పొందకూడదనీ, కింది కోర్టులోనే బెయిల్ వ్యవహారం తేల్చుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది (పీప)ీ వాదించారు. సీఆర్పీసీ సెక్షన్41ఎ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని శ్రీధర్‌రావు లాయర్ వాదించారు. బెయిల్ ఇచ్చిన హైకోర్టు విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.