Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) - ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఇంటెల్, బోస్టన్ ఐటీ సొల్యూషన్స్‌తో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. వీఐటీ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం - ఇంటెల్ మధ్య వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటరెడ్డి, ఇంటెల్ కంట్రీ మేనేజర్ సప్లై చైన్ జితేంద్ర చద్దా ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో విశ్వవిద్యాలయంలోని ఇంటర్నెట్ ఆప్టింగ్స్ (ఐఒటి)లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అందుబాటులోకి రానున్నది. ఈ సెంటర్ ఏర్పాటుతో పరిశ్రమలకు, విద్యార్థులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు, అధ్యాపకులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పరిశోధనలకు, సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బోస్టన్తో జరిగిన ఎంఒయుపై కోట రెడ్డితో పాటు, ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఏ.ఐ లక్ష్మి నాగేశ్వరి సంతకాలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్‌లో తాజా సాంకేతికలపై పరిశోధనలు, రియల్ టైమ్ అప్లికేషన్లు సంయుక్తంగా రూపొందించటం ఈ ఒప్పందంలో ముఖ్య అంశాలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ డైరెక్టర్ డాక్టర్ హరి సీత, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ఎస్.వి.సుధా, ఇంటెల్ హెడ్ గిరీష్, డైరెక్టర్ సుమీత్, ప్రదీప్, బోస్టన్ ఐటీ సొల్యూషన్ ప్రతినిధులు వెంకట్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.