Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా తెచ్చిన మూడు నల్ల చట్టాలను విరమించుకున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం ఏడాది కాలంగా రైతులు చేసిన పోరాటాల విజయమని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఇది దేశం గర్వించదగ్గ మరో స్వాతంత్య్ర రైతాంగ పోరాటమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్లతో కుమ్మక్కై దేశానికి ప్రధాన జీవనాధారమైన వ్యవసాయాన్ని అమ్మాలనే బీజేపీ నాయకుల దుర్మార్గమైన విధానాలకు చెంపపెట్టు అని విమర్శించారు. రైతులు, నాయులకు విప్లవ జేజేలు తెలిపారు. ఈ పోరాటంలో 700 మందికిపైగా రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలనీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగంపై అన్యాయంగా మోపిన కేసులన్నింటినీ ఎత్తేయాలని కోరారు. ఇప్పటికైనా రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు చేయాలని సూచించారు. మందబలాన్ని ఉపయోగించి అప్రజాస్వామిక పద్ధతులతో కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలను విడనాడాలని హెచ్చరించారు.