Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంప్రారం భమైంది. వెబ్ఆప్షన్ల నమోదు చేసేందుకు నేటి వరకు గడువుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. 8,096 మంది అభ్య ర్థులు 1,97,372 వెబ్ఆప్షన్లను నమోదు చేశారు. వివరాలకు https://tseamcet.nic.in ను సంప్రదించాలన్నారు