Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్‌గా దామోదర రాజనర్సింహ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సమస్యలు తదితర అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ అధ్యయన కమిటీని నియమించింది. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆ పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ కమిటీని ప్రకటించారు. చైర్మెన్‌గా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజానర్సింహ, కన్వీనర్‌గా సీనియర్ నేత కోదండరెడ్డి, సభ్యులుగా ఈరవర్తి అనిల్, బెల్లయ్య నాయక్, కొండపల్లి దయాసాగర్, ప్రత్యేక ఆహ్వానితులుగా అన్వేష్‌రెడ్డి, ప్రీతమ్‌ను నియమించారు.