Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, విజయవాడ ప్రాంగణాలకు సంబంధించి హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద హైటెక్ సిటీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్స్ డిజిటల్ కార్యాలయాన్ని ఒరిస్సా అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ ఎస్ నారాయణ పాత్రో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విద్యను, పరిశోధనాత్మక విద్యను విద్యార్థులకు అందించాలని చెప్పారు. వారిని పూర్తిస్థాయి నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు కేఎల్ డీమ్డ్ వర్సిటీ చేస్తున్న కృషిని కొనియాడారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షను అభినందించారు. అడ్మిషన్స్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. కేఎల్ డీమ్డ్ వర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ కోర్సులను జాతీయ స్థాయిలో విద్యార్థులందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతోనే డిజిటల్ కార్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారు. కేఎల్ అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు ఆధునీకరించటం, విద్యాసంస్థ సాధిస్తున్న అభివృద్ధి, చేస్తున్న పరిశోధనలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు, కొత్త కోర్సుల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరికీ తెలిపేందుకే దీన్ని ప్రారంభించామని అన్నారు.