Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోథ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన రైతు ఎస్కె మౌలానా(52) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలానా తన రెండెకరాలతో పాటు మరో ఐదెకరాలు భూమి కౌలుకు తీసుకొని సాగు చేశాడు. చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల పత్తి దిగుబడి తగ్గిపోయింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేక మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రయివేట్‌గా రూ.4.50లక్షల అప్పులున్నాయి. రైతుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజు తెలిపారు.