Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంపుపై డిసెంబర్ 8,9న నిరవధిక దీక్ష
- తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచకుండా ప్రభుత్వం మొండిచేయి చూపెడుతున్నదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్ ఆలీ, పాలడుగు భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.సర్కార్ వైఖరికి నిరసనగా డిసెంబర్ 8,9 తేదీల్లో రాత్రింబవళ్లు నిరాహార దీక్ష చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్‌తో సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక చైర్మెన్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులకు 30శాతం గౌరవ వేతనంతో పాటు రవాణా భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేసే వీలు లేకుండా వేతనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయకుండా హైదరాబాద్‌లో ఒక రకంగా, జిల్లాల్లో మరో రకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పెరిగిన కొత్త పీఆర్సీ వేతనాలు కేవలం జమ్మికుంట, గ్రేటర వరంగల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులకే ఇవ్వడం గత సాంప్రదాయానికి విరద్ధమని పేర్కొన్నారు.