Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమ కారుడు, మాజీ శాసనమండలి సభ్యులు చుక్కా రామ య్యకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోగల ఆయన నివాసంలో మంత్రి రామయ్యను కలిశారు. ఈసందర్భంగా ఆయనకు పాదాభివందనం చేసి, శాలువాతో సత్కరించారు. అలాగే ఆయనకు స్వీట్ బాక్స్‌ని అందచేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నాడు హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చుక్కా రామయ్య పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని వివరించారు. పిల్లలు, పెద్దల కోసం అనేక రచనలు చేసిన రామయ్య, ఆయురారోగ్యాలతో ఉండాలనీ, ఆయనకు సుదీర్ఘ జీవితం లభించాలని మంత్రి ఆకాంక్షించారు. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. దేశం, రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితులపై చర్చించారు. పాలకుర్తి నియోజకవర్గ అభివద్ధి గురించి ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.