Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్ధిపేట ఏరియాలోని పెట్రోల్ బంకుల్లో అనధికారికంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొనసాగిస్తున్నారంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అన్ని అనుమతులతోనే అమ్మకాలు జరుగుతున్నాయంటూ హెచ్‌పీసీఎల్ సమగ్ర వివరాలతో దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత పిటిషనర్ కృష్ణ అనే వ్యక్తికి రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని పీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు జమ చేసేలా సిద్ధిపేట జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది.