Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిమాండ్ల సాధన కోసం సోమవారం తలపెట్టిన సామూహిక సెలవుల నిరసనను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్‌డీఏ) తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్థన్ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి చర్చించారు. సర్వీస్ కోటాలో అర్బన్ ఇన్ సర్వీస్‌ను చేర్చాలనీ, గతంలో మాదిరిగా ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోనూ ఇన్ సర్వీస్ కోటాను పునరుద్ధరించాలనీ, క్లినికల్ సీట్లలో సర్వీస్ కోటాను 20 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని కోరారు.